Delhi Police 'Lathicharge' On Special Status Sadhana Committee Activists | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-04

Views 1

Pratyeka Hoda Sadhana Samithi objection in Delhi. Police lathicharge on activists. AP CM Chandrababu Naidu and Jana Sena chief Pawan Kalyan Angry over that lathicharge and pm modi.
#apspecialstatus
#Pratyekahodasadhanasamiti
#policelathicharge
#modi
#delhilathicharge

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో సీపీఐ, సీపీఎం, ప్రత్యేక హోదా సాధన సమితిల ఆధ్వర్యంలో పార్లమెంటును ముట్టడించే ప్రయత్నాలు చేశారు. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తదితరులు ఖండించారు. హోదా సాధన సమిత ఆధ్వర్యంలో గురువారం జంతర్ మంతర్ వద్ద నిరనస కార్యక్రమం చేపట్టారు. అనంతరం పార్లమెంటు ముట్టడికి బయలుదేరారు. మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను ఆందోళనకారులు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో లాఠీఛార్జ్ జరిగింది. వీరి నిరసనకు మద్దతు తెలిపిన టీడీపీ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై లాఠీఛార్జ్, అరెస్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న వారిపై లాఠీఛార్జి చేస్తారా అని ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form