Opposition parties from Andhra Pradesh YSR Congress Party, Congress holds a protest in Delhi on Monday to demand special category status for the southern state that was bifurcated in 2014.
పార్లమెంటు సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ, ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపీని టార్గెట్ చేశాయి. టీడీపీ ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానం ఇచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆందోళనకు దిగింది.
ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, హోదావల్ల రాయితీలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని, ఊసరవెల్లికే రంగులు మార్చడం నేర్పుతున్నారని ఆయన అన్నరు. హోదా కోసం ఆఖరి అస్త్రంగా మంత్రులతో రాజీనామాలు చేయిస్తానని చంద్రబాబు చెబుతున్నారు గానీ ఇ్పపటికే నాలుగేళ్లు గడిచాయి కాబట్టి ఆఖరి అస్త్రంగా కాకుండాతొల అస్త్రంగానే రాజీనామాలు చేయించాలని అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి బహిరంగ సభలో ఆదివారం ఆయన మాట్లాడారు.