YSR Congress president Y.S. Jagan Mohan Reddy on Sunday said his party would launch a relentless struggle for the Special Category Status (SCS) within and outside Parliament from Monday when the Budget session resumes.
నేటి నుంచి పార్లమెంట్ మలి విడుత సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహాధర్నాకు సిద్దమైంది. 'హోదా' గళాన్ని ఢిల్లీలో వినిపించేందుకు సంసద్‌మార్గ్‌లో మహా ధర్నాను చేపట్టబోతోంది. మహాధర్నా కోసం ఇప్పటికే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలారు.
మహాధర్నా నేపథ్యంలో వైసీపీ భారీ జన సమీకరణ చేపట్టింది. ఇందుకోసం విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు ద్వారా ఆదివారం కార్యకర్తలను, సామాన్య ప్రజలను తరలించింది. ఢిల్లీలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లు చేశారు. భోజనంతో పాటు వసతి ఏర్పాట్లు కల్పిస్తున్నారు. ఏపీ, హైదరాబాద్ తో పాటు బెంగళూరు నగరం నుంచి కూడా వేలాదిగా జనం తరలివచ్చినట్టు చెబుతున్నారు.