Chandrababu Naidu has called an urgent meeting to discuss his Telugu Desam Party (TDP)'s future with the BJP, a day after pulling two ministers from the central government over a demand for "special status" for Andhra Pradesh.
బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి అదనంగా వచ్చిన లాభం ఏమీ లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రులు, అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన్నికల కన్నా ముందే జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. బీజేపీతో పొత్తు లేకుండా బరిలోకి దిగిన సమయంలో వచ్చిన ఓట్లే, పొత్తు తర్వాత కూడా వచ్చాయని చెప్పారు.
ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామంటేనే కేంద్ర ప్రతిపాదనలకు అంగీకరించామని చంద్రబాబు తెలిపారు. ఈఏపీ ద్వారా నిధులు ఇస్తామని ఏడాదిన్నర క్రితం హామీ ఇచ్చిన కేంద్రం ఇంతవరకు దానిని నిలబెట్టుకోలేదన్నారు
యూసీలు కావాలని కేంద్రం అడిగిన ప్రతిసారీ, ఎప్పటికప్పుడు స్పందించి పంపుతూనే ఉన్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి సాయం చేసి ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఎదురుదాడికి దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.