AP special status Protest : Rahul Gandhi joined

Oneindia Telugu 2018-03-06

Views 987

Andhra Pradesh Chief Minister Nara Chandrababu blames Congress and BJP for AP division and poll promises. Congress president Rahul Gandhi has joined in with the TDP and YSRC protest at Jantar Mantar and said that the Congress party is in favour of granting special status to Andhra Pradesh and if they come to power in 2019, they would ensure the same.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో నిరసనలు వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద అండ లభించింది. వేర్వేరుగా అయినా టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

పార్లమెంటు బయట, వెలుపల టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు స్ట్రీట్‌లో ఆంధ్రుల ఆత్మ గౌరవ సభను మంగళవారం నిర్వహించారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని రాహుల్ గాంధీ అన్నారు. తాము (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చాక ఏపీకి హోదాను ఇస్తామని చెప్పారు. తాను, తమ పార్టీ ఆంధ్రుల పక్షాణ నిలబడుతుందని చెప్పారు. మనమంతా ఒక్కటిగా ఉంటే ప్రభుత్వం, మోడీ మెడలు వంచవచ్చునని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు మోడీ కచ్చితంగా అమలు చేయాలన్నారు

బడ్జెట్ తొలి విడత సమావేశాల సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సోనియా గాంధీని టీడీపీ ఎంపీలు కలిశారు. ఏపీ ఎంపీల ఆందోళనకు మద్దతుగా రాహుల్ గాంధీ అప్పుడు ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS