గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, రోడ్లు సమస్య, వీది దీపాలు సమస్యతో పాటు కనీససౌకర్యాలు లేక నిత్యం సతమతం అవుతున్నామని ఆరోపిస్తూ ఓ మహిళ పోలింగ్ కేంద్రంలో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కర్ణాకలోని హావేరి జిల్లాలో సంచలనం కలిగించింది.
పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది, స్థానిక నాయకులు హడలిపోయి వెంటనే స్పంధించడంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. హావేరి జిల్లోని దేవగిరిలోని పోలింగ్ కేంద్రంలోకి శనివారం పాపమ్మ ఆర్కాచారి అనే మహిళ ఓటరు ఐడీ చేతిలో పట్టుకుని వెళ్లారు.
ఓటరు ఐడీ గుర్తింపు కార్డు చూపించి ఓటు వెయ్యడానికి ఈవీఎం దగ్గరకు వెళ్లారు. తరువాత బ్యాగ్ లో వెంట తీసుకెళ్లిన కిరోసిన్ డబ్బా బయటకు తీసిన పాపమ్మ ఒంటి మీద పోసుకున్నారు. తన గ్రామంలో కనీస సౌకర్యాలు లేవని ఎన్నిసార్లు చెప్పినా నాయకులు పట్టించుకోలేదని పాపమ్మ ఆరోపించారు.
తన చావుతో అయినా మా గ్రామానికి కనీసౌకర్యాలు వస్తాయని ఆశిస్తున్నానని చెప్పిన పాపమ్మ అగ్గిపెట్టె తీసుకుని నిప్పంటించుకోవడానికి ప్రమత్నించారు. ఆ సందర్బంలో హడలిపోయిన ఎన్నికల అధికారులు, సిబ్బంది, సమీపంలోని నాయకులు వెంటనే స్పంధించారు.