Karnataka Assembly Elections : కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు ?

Oneindia Telugu 2018-03-30

Views 122

The day dates for Karnataka Assembly elections were declared, West Bengal Chief Minister Mamata Banerjee asked the Congress to ally with former prime minister HD Deve Gowda’s Janata Dal (Secular). Speaking to the media, she had said, “Deve Gowda is a nice person. The Congress should go with him to defeat the BJP.”

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఎటువంటి పొత్తు కుదిరినా ఆ రెండింటికి విధ్వంసకరమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ బీజేపీ బలం సగానికి తగ్గించినా ఇదే పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడతో పొత్తు కుదుర్చుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సూచించారు. దేవెగౌడ చాలా మంచి మనిషి, బీజేపీని ఓడించేందుకు ఆయనతో కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని మీడియాతో అన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్దం అని దేవెగౌడ సంకేతాలు ఇచ్చారు.
కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని మాజీ ప్రదాని హెచ్ డీ దేవెగౌడ ప్రకటించిన నిమిషాల్లో జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అవకాశం లేదని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఓ గంట తర్వాత దేవెగౌడ కూడా ‘యూ - టర్న్'తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసే ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం నోరు మెదపలేదు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కన్నడ నేలపై కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) కనీసం 60 - 70 అసెంబ్లీ స్థానాల పరిధిలో ముఖాముఖీ పోటీ పడుతున్నాయని చెబుతున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే 224 స్థానాలకు పోటీ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ 160 స్థానాల్లో మాత్రమే బలం కలిగి ఉన్నది. ఇక జేడీఎస్ 70 - 80 స్థానాలకు పరిమితమై ఉన్నది. రాష్ట్ర రాజధాని బెంగళూరు మినహా ఓల్డ్ మైసూర్ ప్రాంతంతోపాటు జేడీఎస్ పార్టీకి గట్టి పట్టు ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్, గౌడల మధ్య ముఖాముఖీ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. మిగతా రాష్ట్రమంతటా కాంగ్రెస్, బీజేపీ ముఖముఖీ పోటీలు ఉంటాయంటున్నారు. కేవలం 25 - 30 స్థానాల పరిధిలో మాత్రమే త్రిముఖ పోటీ ఉంటుందని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు రాజకీయంగా పొసగదని విశ్లేషకులు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS