Karnataka Assembly Elections 2018: Siddaramaiah Likely to Lose in Chamundeshwari

Oneindia Telugu 2018-05-15

Views 2

Karnataka Election Results 2018: chief minister Siddaramaiah faceing set back in chamundeshwari constituency counting against GT Devegowda.
#ExitPolls
#KarnatakaAssemblyElections2018
#Siddaramaiah
#Yedyurappa
#Kumaraswamy

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం సిద్దరామయ్య మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గంలో ప్రత్యర్థి, స్థానిక జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ దెబ్బకు వెనకబడిపోయారు.
బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గంలో బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములుకు సీఎం సిద్దరామయ్య గట్టిపోటీ ఇస్తున్నారు. బాదామి శాసన సభ నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య, బి. శ్రీరాములు నువ్వానేనా అంటు ఓట్ల లెక్కింపులో పోటీపడుతున్నారు.
మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యకు 5వ రౌండ్ లో 12,960 ఓట్లు వచ్చాయి. సీఎం సిద్దరామయ్య మీద పోటీ చేసిన స్థానిక ఎమ్మెల్యే, జేడీఎస్ అభ్యర్థి జీటీ. దేవేగౌడకు 17,356 ఓట్లు వచ్చాయి. చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య వెనకబడిపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
బాదామి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య, బీజేపీ ఎంపీ శ్రీరాములు నువ్వానేనా అంటూ పోటీపడుతున్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అంటూ ప్రజలు అంచనా వెయ్యలేకపోతున్నారు.
కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అంటూ పోటీ పడుతుండంతో ఇటు జేడీఎస్ మాత్రం మేములేకుండా మీరెవ్వరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరని అంటోంది. కర్ణాటకలో ఎవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్నా జేడీఎస్ పార్టీ కీలకంగా మారనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS