Karnataka Assembly Elections 2023:Jan Ki Baat Suvarna News Survey says that BJP will get absolute Majority in the upcoming Karnataka Assembly Elections 2023 | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఐదు రోజుల ముందు జన్ కీ బాత్-సువర్ణ న్యూస్ రెండో విడత సర్వే ఫలితాలు విడుదల చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సర్వే తెలిపింది.కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్నా 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈసారి బీజేపీ 114 సీట్లు వస్తాయని ఈసర్వేలో వెలుగు చూడటంతో బీజేపీకి కొంచెం బలం వచ్చినట్లు అయ్యింది. శనివారం, ఆదివారం బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు ఉండటంతో ఐటీ హబ్ లో కూడా పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉందని జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ కన్నడ సర్వే తెలిపింది.
#KarnatakaAssemblyElections2023
#pmmodi
#bjp#congress
#JanKiBaatSuvarnaNewsSurvey
#మోదీ
~ED.42~PR.39~