The wait is over. The result of Karnataka assembly elections 2018, which was dubbed as the biggest political battle of the year, would be declared today (May 15) and you can catch all the live action here.
దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
బీజేపీ: ఆధిక్యం: 083, గెలుపు: 000 కాంగ్రెస్: ఆధిక్యం: 078, గెలుపు: 000 జేడీఎస్: ఆధిక్యం: 037, గెలుపు: 000 ఇతరులు: ఆధిక్యం: 001, గెలుపు: 000 కాగా, 2019లో లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత నెలకొంది. అందుకే భారతీయ జనతా పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ కూడా తీవ్రంగా గెలుపు కోసం ప్రయత్నాలు చేశాయి.
కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగ్గా.. నేడు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం 38 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వలేదు. దీంతో జేడీఎస్ కీలకంగా మారుతుందని తెలుస్తోంది. అయితే, కొన్ని ఛానళ్లు బీజేపీ, మరికొన్ని ఛానళ్లు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పేర్కొన్నాయి.