Karnataka Chief Minister Siddaramaiah today said while he is willing to stay on as the Chief Minister for another term, he would step aside for a Dalit candidate if the party high command so desires.
#ExitPolls
#KarnatakaAssemblyElections2018
#Siddaramaiah
#Yedyurappa
#Kumaraswamy
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరో ట్విస్ట్. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ఆసక్తికర ప్రకటన చేశారు. పార్టీ అధిష్టానం దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తాను అంగీకరిస్తానని వెల్లడించారు. సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారని అంటున్నారు.
ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రావని, హంగ్ వస్తుందని ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో జేడీఎస్ కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చర్చ జరుగుతుండగా సిద్ధూ హఠాత్తుగా 'దళిత ముఖ్యమంత్రి' వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీతో కలిసేది లేదని ఇప్పటికే జేడీఎస్ అధినేత దేవేగౌడ చెప్పారు.
దళిత ముఖ్యమంత్రి అంశంపై సిద్ధరామయ్య మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. తమ పార్టీ అధిష్టానం దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతూ.. గెలిచిన ఎమ్మెల్యేల మాట వినాలని, వారి అభీష్టం ప్రకారం ముందుకెళ్లాలని మెలిక పెట్టారు. జేడీఎస్ మద్దతు కోసమే సిద్ధరామయ్య దళిత సీఎం ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. జేడీఎస్ -మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎగ్జిట్ పోల్స్ హంగ్ వస్తుందని చెప్పిన తర్వాత సిద్ధూకు దళిత సీఎం గుర్తుకు వచ్చిందని, ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఎందుకు గుర్తుకు రాలేదని అంటున్నారు. మొత్తానికి జేడీఎస్ మద్దతు కోసం ఆ ప్రకటన చేశారని అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా కర్నాటకకు దళిత సీఎం కావాలన్నారు. ఇన్నాళ్లు గుర్తుకు రానిది ఇప్పుడు గుర్తుకు వచ్చారనేదే అందరి ప్రశ్నగా ఉంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా చర్చించుకుంటున్నారు. హంగ్ వస్తే జేడీఎస్ మద్దతు కోసం దళిత సీఎం పదవిని తెరపైకి తెచ్చారని, ఒకవేళ మెజార్టీ వస్తే అనే ఉద్దేశ్యంతోనే.. అందరు ఎమ్మెల్యేలు అంగీకరించే వారు కావాలని మెలిక పెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో కర్నాటకలో నేతలు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు హంగ్ వస్తుందని తేలడంతో ముఖ్య నేతలు మంతనాల్లో మునిగిపోయారు. జేడీఎస్ కింగ్ లేదా కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశముంది. ఇదే సమయంలో జేడీఎస్ అధినేత కుమార స్వామి సింగపూర్ వెళ్లారు. ఆయన సింగపూర్ పర్యటన వెనుక కారణం మంతనాలు అనే చర్చ సాగుతోంది.