India vs Bangladesh : Dinesh Karthik Great Words About Dhoni

Oneindia Telugu 2018-03-21

Views 155

Dinesh Karthik’s 8-ball-29 against Bangladesh in Nidahas Trophy final has made him the new hero of the nation. Dinesh Karthik feels When it comes to Dhoni — I am studying in a university where he is the topper. He is one of the guys I have always looked up to. It is unfair to compare me with him.”

శ్రీలంక వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్లో భారత్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగాసంచలన బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించిన దినేశ్‌ కార్తీక్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచ్‌లను ముగించడంలో మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనితో అతడిని పోలుస్తున్నారు అభిమానులు. ధోని తర్వాత ఫినిషర్‌ పాత్ర పోషించబోయేది కార్తీకే అని కూడా అంటున్నారు. దీనిపై కార్తీక్‌ స్పందించాడు. తనను ధోనీతో పోల్చవద్దని కోరాడు.
'ధోని టాపర్‌గా ఉన్న యూనివర్శిటీలో నేను చదువుకుంటున్నా. నేను స్ఫూర్తి కోసం చూసే ఆటగాళ్లలో అతనొకడు. నన్ను అతడితో పోల్చడం సబబు కాదు. ప్రస్తుతం నేనున్న స్థితితో సంతృప్తిగా ఉన్నా' అని కార్తీక్‌ స్పష్టం చేశాడు. ధోని కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కార్తీక్‌.. అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయాడు. అతడి తర్వాత భారత జట్టులోకి వచ్చిన ధోని ఆటగాడిగా, కెప్టెన్‌గా తిరుగులేని స్థాయిని అందుకున్నాడు.
‘ధోనితో పోలిస్తే నా ప్రయాణం పూర్తి భిన్నమైంది. అతను గొప్ప ఆటగాడు. ఒకప్పుడు ధోని సిగ్గరి. ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కానీ ఇప్పుడు కుర్రాళ్లకు సాయం చేసేందుకు చాలా మాట్లాడుతున్నాడు' అని చెప్పాడు. ఆదివారం నాటి ఇన్నింగ్స్‌తో తనపై అందరి దృష్టి నిలవడం మంచి అనుభూతినిస్తోందని, ఇన్నేళ్లలో తాను చేసిన మంచి పనులు నాకు కలిసొచ్చి ఆ సిక్సర్‌ బాదేలా చేశాయనుకుంటున్నానని కార్తీక్‌ అన్నాడు. ‘ఈ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం అని దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు.

Share This Video


Download

  
Report form