India vs Bangladesh : Dinesh Karthik Moment : Reactions

Oneindia Telugu 2018-03-19

Views 178

Veteran India batsman Dinesh Karthik did well with a last-ball six as India pulled off an incredible chase to defeat Bangladesh by four wickets in the Nidahas T20 Tri-series final

అద్బుతమైన ప్రదర్శనతో దినేశ్‌ కార్తీక్‌ అదరగొట్టాడు. నిదహాస్ టోర్నీ టీ20 ఫైన‌ల్లో మిస్సైల్‌లా పేలి భార‌త్‌కు థ్రిల్లింగ్‌ విక్ట‌రీ అందించాడు. నాగిని జోష్‌లో ఉన్న బంగ్లా టైగ‌ర్స్‌ను చివరి వరకూ ఊరించి నిరాశపరిచాడు. ఆఖ‌రి బంతికి సిక్స‌ర్ కొట్టడంతో భారత విజయ కాంక్షకి ఓ రూపమొచ్చింది. ఆఫ్ సైడ్‌లో వేసిన బంతిని లాంగ్ ఆఫ్ మీదుగా సిక్స‌ర్‌తో కార్తీక్ మ్యాచ్‌ను గెలిపించాడు. బంగ్లాతో జ‌రిగిన ఫైన‌ల్లో చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో భార‌త్ విజ‌యం కోసం 34 చేయాల్సి ఉంది. అయితే 19వ ఓవ‌ర్‌లోనే కార్తీక్ రెండు సిక్స‌ర్ల‌తో విక్ట‌రీపై ఆశ‌లు రేపాడు. కార్తీక్ 8 బంతుల్లోనే 3 సిక్స‌ర్లు, 2 ఫోర్ల‌తో 29 ర‌న్స్ చేసి డీకే థ్రిల్ల‌ర్ చూపించాడు. బంగ్లా 166 ర‌న్స్ చేయ‌గా.. భార‌త్ ఆ టార్గెట్‌ను చివ‌రి బంతితో విజేతగా నిలిచింది. దీంతో కార్తీక్‌కు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు వెల్లువెత్తాయి.

Share This Video


Download

  
Report form