India vs Bangladesh: Nidahas Trophy 2018: Team India Under pressure

Oneindia Telugu 2018-03-08

Views 74

Captain Rohit Sharma, however, backed the young palyers to deliver against Bangladesh.How Rohit and Dhawan start will always be important for India's chances.

ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా టీమిండియా మరో పరీక్షకు సిద్ధమైంది. భారత జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న యువ క్రికెటర్లకు మరో అద్భుత అవకాశం. ఈ నేపథ్యంలో భాగంగా రెండో టీ20 లీగ్ మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ క్రికెటర్లు లేకుండా శ్రీలంకకు వెళ్లిన భారత్‌ తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది.

టోర్నీలో భాగంగా జరిగిన తొలి టీ20లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ల్లో తడబడి లంక చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్ ఓటమితో పాయింట్ల పట్టికలో ఖాతా తెరువలేకపోయిన టీమిండియా ఫైనల్ ఆశలు క్లిష్టం కాకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో మార్పులు ఏమైనా చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Share This Video


Download

  
Report form