Nidahas Trophy 2018 : Bangladesh Beat Sri Lanka, Face India In Final

Oneindia Telugu 2018-03-17

Views 150

Bangladesh pulled off a two-wicket victory over Sri Lanka to set up a summit clash against India in the Nidahas Twenty20 cricket tri-series on Friday.

ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆతిధ్య శ్రీలంకపై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ విజయంతో ముక్కోణపు టీ20 సిరిస్ ఫైనల్‌కు బంగ్లాదేశ్ చేరుకుంది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌(50) హాఫ్‌ సెంచరీ సాధించగా, మొహ్మదుల్లా(43 నాటౌట్‌)లు బంగ్లాదేశ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి వరకు ఉత్కంఠ భరింతగా సాగిన పోరులో మొహ్మదుల్లా సిక్స్‌ కొట్టి విజయాన్ని అందించాడు. ఇక, బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజర్‌ రహ్మన్‌ రెండు వికెట్లు తీసుకోగా, షకిబ్‌, మెహదీ హసన్‌, రూబెల్ హుస్సేన్ తలో వికెట్‌ తీశారు
అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 159 పరుగులు చేసింది. లంక ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. దనుష గుణతిలకా(4), కుశాల్‌ మెండిస్‌(11), ఉపుల్‌ తరంగా(5), షనక(0), జీవన్‌ మెండిస్‌(3) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌‌కు చేరడంతో లంక 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్ పెరీరా (61), తిషారా పెరీరా (58)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆతిథ్య శ్రీలంక ఈ మాత్రం నామమాత్రపు స్కోరు చేయగలిగింది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతావారంతా స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. తొలి 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసిన లంక... వీరి విజృంభణతో మిగతా 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది
ఈ సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగే ఫైనల్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. మరొవైపు స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరకపోవడం ఆ దేశ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది.

Share This Video


Download

  
Report form