మీ కంప్యూటర్ స్క్రీన్ మీద కన్పించే దృశ్యాలను ఉన్నవి ఉన్నట్లు మీ టివిపై పొందొచ్చు. దీనికి మన వద్ద కావలసిందల్లా అదనపు HDMI లేదా DVI పోర్టులను కలిగిన ఆన్ బోర్డ్ డిస్ ప్లే, లేదా ప్రత్యేకంగా మనం కొనుక్కుని పెట్టవలసిన డిస్ ప్లే కార్డ్ మాత్రమే. సరే మీవద్ద పోర్టు, కేబుల్ సిద్ధంగా ఉన్నాయనుకుందాం.. మీ స్క్రీన్ ని మీ టివికి గానీ, లేదా ప్రొజెక్టర్ కి గానీ పంచుకోవాలనుకుంటే ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలో ఈ క్రింది వీడియోలో వివరించాను. ఒకవేళ మీ రెండవ డిస్ ప్లే గుర్తించబడకపోతే సమస్యని ఎలా పరిష్కరించాలో కూడా తెలియజేశాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా అర్థమవుతుంది.