కొత్తగా వెబ్ సైట్ పెట్టాలనుకునే వారు ఎలాంటి వెబ్ డిజైనింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఫర్వాలేదు. వెబ్ డిజైనర్లుగా చలామణి అయ్యే చాలామంది Wordpress, Joomla, Drupal వంటి scriptsని మన హోస్టింగ్ స్పేస్ లో వేసి, కొద్దిగా కస్టమైజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈపాటి పని ఎవరైనా చేసేయొచ్చు. కొద్దిగా క్లిష్టంగా ఉండేదల్లా డేటాబేస్ లను సృష్టించి మనం ఇన్ స్టాల్ చేయబోయే వర్డ్ ప్రెస్ వంటి scriptతో లింక్ చేయడమే. ఈ టెక్నిక్ సులభంగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.