తప్పనిసరిగా కంప్యూటర్ ఆన్ చేసి ఉండాల్సిన సందర్భంలో మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ Start మెనూలోని Shutdown ఆప్షన్ ద్వారా షట్ డౌన్ చేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాంటప్పుడు అసలు Start మెనూలో Shutdown అనే ఆప్షనే కన్పించకుండా మాయం చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఆ ఆప్షన్ మాయం అవడం మీరు ప్రాక్టికల్ గా ఈ వీడియోలో చూడొచ్చు. కొందరు షట్ డౌన్ కన్పించకపోతే నేరుగా పవర్ ఆఫ్ చేసేస్తారనుకోండి, కానీ నెట్ వర్క్ ఎన్విరాన్ మెంట్స్ లో ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పిన పద్ధతి కాకుండా గ్రూప్ పాలసీ ద్వారా కూడా దీన్ని సాధించవచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothu sridhar editor computerera telugu magazine