మీ కంప్యూటర్లో ఏ MS Wordనో, మరో ప్రోగ్రామో ఎల్లప్పుడూ రన్ అవుతూ ఉండాలి అనుకుందాం. మీరు పిసి దగ్గర లేనప్పుడు అది క్రాష్ అయి క్లోజ్ అయితే అంతే సంగతులు. తిరిగి మనం అది క్లోజ్ అయిన విషయాన్ని గమనించి రన్ చేసుకునే వరకూ పని నడవదు. అలాకాకుండా మనకు కావలసిన ప్రోగ్రాములన్నీ ఎల్లప్పుడూ రన్ అయ్యేలా చేయడంతో పాటు వివిధ అప్లికేషన్లూ, ప్రాసెస్ లకు ప్రయారిటీలు సెట్ చేయడం ద్వారా అవి స్లో అవకుండా భేషుగ్గా పనిచేసేలా ఏర్పాటు చేసే ఓ మార్గం గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine