మీరు మీ మొబైల్ ద్వారానో, నెట్ బుక్ ద్వారానో మొబైల్ లోని ఏదైనా SMSని గానీ, మెయిల్ ని గానీ, వెబ్ పేజీని గానీ ప్రింట్ ఇచ్చుకోవచ్చని తెలుసా? మొబైల్ కి ప్రింటర్ ఎలా కనెక్ట్ అవుతుందీ అని ఆశ్చర్యపోతున్నారా? అసలు అదే సాధ్యపడితే ఆఫీస్ కెళ్లే దారిలోనే ప్రింట్ ఇచ్చేస్తే మన ఆఫీసులో ఆ ఫైల్ దానికది ప్రింట్ అయి కూర్చుంటే అద్భుతమే కదా! నేను చెప్పింది సాధ్యమే!