I Accept And Respect The Academy's Decision": Will Smith On 10-Year Oscars బ్యాన్
#willsmith
#oscars
#hollywood
#chrisrock
విల్ స్మిత్.. కొద్ది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోన్న పేరిది. ఇటీవలే జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో తన భార్యపై జోక్ చేశాడన్న కారణంతో ప్రజెంటర్ క్రిస్ రాక్‌ను స్మిత్ చెంపదెబ్బ కొట్టాడు. అప్పటి నుంచి అతడు హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ ఊహించని పరిణామం తర్వాత స్మిత్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అలాగే, ఎన్నో కీలక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఈ హాలీవుడ్ యాక్టర్‌పై తీవ్ర చర్యలు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా స్మిత్‌పై నిషేదాన్ని విధిస్తూ హాలీవుడ్ అకాడమీ కమిటీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో ఏముంది? చూద్దాం పదండి!