The recall of Chris Gayle to the West Indies ODI squad, for the first time since the 2015 World Cup, has dominated the countdown to the upcoming five-match series against England. But Gayle -- one of the biggest draws in the game -- is likely to make his first appearance against Ireland on Wednesday.
వెస్టిండిస్.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు. అయితే ఈ మధ్యకాలంలో ఈ జట్టు ఆటతీరు తీసికట్టుగా తయారైంది. ఎంతలా ఆంటే ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఇక, 2019లో ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవడంపై కూడా సందిగ్థత నెలకొంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న వెస్టిండిస్ వచ్చే వరల్డ్ కప్‌కు అర్హత సాధించాలంటే త్వరలో ఆడే మ్యాచ్‌లు ఎంతో కీలకం కానున్నాయి.