IND vs ENG 4th Test: India Has Worst Records At The Oval Cricket Ground Which Troubles Virat Kohli And Co.
#INDvsENG4thTest
#TeamIndia
#TeamIndiaRecordsAtOval
#ViratKohliAndCo
#OvalCricketGround
#JoeRoot
#IndiasRecordatOval
ఫస్ట్ టెస్ట్‌లో విజయాన్ని తృటిలో చేజార్చుకొని.. రెండో టెస్ట్‌లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి ఇంగ్లండ్ గడ్డపై జోరు కనబర్చిన కోహ్లీసేన.. గత మ్యాచ్‌లో మాత్రం పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లండ్ బౌలర్ల ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్ దారుణ ఓటమికి కారణమయ్యారు. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇప్పుడు ఓవల్ వేదికగా మరో ఆసక్తికరపోరుకు రెడీ అవుతున్నాయి. విజయ ఉత్సాహంలో ఆతిథ్య జట్టు బరిలోకి దిగుతుండగా.. దెబ్బతిన్న పులిలా గర్జించేందుకు భారత ఆటగాళ్లు సమాయత్తం అవుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఓవల్ మైదానంలోని రికార్డులు భారత జట్టును కలవరపెడుతున్నాయి.