Ind Vs Eng : Lords Test match prediction and pitch report
#teamindia
#Indvseng
#ViratKohli
#LordsTest
వర్షం కారణంగా తొలి టెస్ట్‌లో విజయానికి దూరమైన టీమిండియా.. ఇంగ్లండ్‌తో కీలకమైన రెండో టెస్ట్‌కు రెడీ అయ్యింది. గురువారం (మధ్యాహ్నం 3.30 గంటల) నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో మరింత మెరుగైన బ్యాటింగ్ షో చూపెట్టాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌నూ మరింత బలోపేతం చచేయాలని భావిస్తోంది. ఒకే ఒక మార్పు మినహా టీమిండియా బృందంలో సమస్యలేమీ లేకపోగా... ఇద్దరు ప్రధాన పేసర్ల గాయాలతో ఇంగ్లండ్ ఇబ్బంది పడుతోంది. స్వల్ప బ్యాటింగ్ సమస్యను మినహాయిస్తే మొత్తంగా ఇంగ్లండ్‌పై ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది.