India's Tour Of South Africa And India's tour of England: Reports says that Team India's regular captain Rohit Sharma will not be a part of Ind vs SA T20I series | భారత క్రికెట్ జట్టును రెండుగా విభజించడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడబోయే టీ20 టీమ్‌కు శిఖర్ ధవన్ సారథ్యాన్ని వహించబోతున్నాడు. ఇందులో టీ20 స్పెషలిస్టులను తీసుకోనుంది సెలెక్షన్ కమిటీ. ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లే జట్టుకు రోహిత్ శర్మ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సీనియర్ ప్లేయర్లను ఈ జట్టు కోసం ఎంపిక చేయనుంది సెలెక్షన్ కమిటీ. ఈ సిరీస్ కోసం తనను ఎంపిక చేయవద్దంటూ రోహిత్ శర్మ బీసీసీఐకి విజ్ఞప్తి చేశారని అంటున్నారు. ఆయన విజ్ఞప్తి పట్ల సెలెక్షన్ కమిటీ సానుకూలంగా స్పందిస్తుందని అంటున్నారు.
#INDVSSA
#RohitSharma
#teamindia