భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లకు అత్యధిక డిమాండ్ ఉండటం వల్ల, ప్రీమియం కార్లను కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీలు సరసమైన ధలకే తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. ఈ తరుణంలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ఏ-క్లాస్ లిమోసిన్ ను ప్రవేశపెట్టింది. ఇది క్వాలిటీ ఇంటీరియర్స్, లగ్జరీ ఫీచర్స్ తో పాటు మంచి పనితీరుని కూడా అందిస్తుంది.
ఇటీవల మేము మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్‌ను సుందరమైన గోవా వీధుల్లో డ్రైవ్ చేసాము. కంపెనీ నిర్దేశించిన ఫీచర్స్ మరియు దీని పనితీరు వంటి ఇతర అంశాలను గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.. రండి.