భారతదేశంలో ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రసిద్ధి చెందిన కంపెనీ ఎంజి మోటార్స్. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాల వాహనాలు దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఎంజి మోటార్స్ యొక్క మరో ఎస్‌యూవీ ఈ ఎంజి హెక్టర్ ఎస్‌యూవీ.
ఎంజి హెక్టర్ ఎస్‌యూవీ గత ఏడాది 2019 మధ్యలో మన దేశంలో లాంచ్ చేయబడింది. ఈ ఎస్‌యూవీని నాలుగు వేరియంట్లు మరియు మూడు ఇంజిన్ కాన్ఫిగరేషన్లలో అందించారు. ఇది అనతి కాలంలోనే చాలామంది వినియోగదారుల అభిమాన వాహనంగా మారిపోయింది. హెక్టర్ ఎస్‌యూవీ చూడటానికి కొంత భారీగా అనిపించినా చాలా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది దేశంలో మొట్టమొదటి AI ఎనేబుల్ ఎస్‌యూవీగా నిలిచింది.
ఇటీవల పూణేలో ఎంజి హెక్టర్ ప్లస్ డీజిల్ వేరియంట్‌ను నడపడానికి మాకు అవకాశం లభించింది. ఇక్కడ మా ఫస్ట్ డ్రైవ్ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాము. ఎంజి హెక్టర్ ప్లస్ డీజిల్ వేరియంట్ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి