టాటా మోటార్స్ ఇటీవల తమ సరికొత్త సఫారి ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ‘సఫారి’ భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. టాటా సఫారీ కేవలం ఇప్పుడు పుట్టుకొచ్చింది మాత్రం కాదు, ఇది 1998 నాటిది. దాదాపు కొన్ని సంవత్సరాలుగా, టాటా సఫారీ చాలా అప్డేట్స్ పొందింది. అయితే ఇది 2019 లో నిలిపివేయబడింది.
అయితే ఇప్పుడు కొత్త టాటా సఫారీ లాంచ్ దేశీయ మార్కెట్లో 2021 ఫిబ్రవరి నెలలో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. టాటా సఫారీ భారత మార్కెట్లో ప్రారంభించటానికి ముందు, టాటా సఫారీ దాని వారసత్వానికి అనుగుణంగా ఉందో, లేదో తెలుసుకోవడానికి మేము సరికొత్త 7 సీట్స్ ఎస్‌యూవీని డ్రైవ్ చేసాము.
కొత్త టాటా సఫారీ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.