దక్షిణ కొరియా కార్ దిగ్గజం కియా మోటార్స్ భారత మార్కెట్లో చాలా మంచి స్పందనను పొందింది. ప్రస్తుతం కియా మోటార్స్ యొక్క సెల్టోస్ మరియు కార్నివాల్ వారి విభాగాలలో ఎక్కువ జనాదరణ పొందిన సమర్పణలుగా మారాయి. అంతే కాకుండా సెల్టోస్ కొన్ని సందర్భాలలో టాప్ ర్యాంకింగ్స్‌ను కూడా నమోదు చేసింది.
ఇప్పుడు కొరియా కార్ల తయారీదారు ఈ విజయాన్ని భారత మార్కెట్లో, సోనెట్ రూపంలో మరో ‘ఆల్-న్యూ మోడల్’తో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో తయారవుతున్న ఈ కొత్త కియా సోనెట్ ఎస్‌యూవీ భారతదేశానికి బ్రాండ్ యొక్క మూడవ మోడల్ మరియు రెండవ ‘మేడ్-ఇన్-ఇండియా’ ఉత్పత్తి అవుతుంది.
కియా సోనెట్ మార్కెట్లో ప్రారంభించటానికి కొద్ది రోజుల ముందు, ప్రతి ఒక్కరి మనస్సులో కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మేము కియా సోనెట్‌ను డ్రైవ్ చేసాము. కియా సొనెట్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.