దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తమ వినియోగదారుల కోసం హెల్త్ అండ్ హైజీన్ యాక్ససరీస్ విడుదల చేసింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో, టాటా కార్ల యజమానులకు మరింత భద్రతను ఆఫర్ చేసేలా ఈ కొత్త యాక్ససరీస్‌ను డిజైన్ చేశారు.
కొత్తగా టాటా కార్లను కొనుగోలు చేసేవారికి మరియు ఇప్పటికే ఉన్న టాటా కార్ల యజమానుల కోసం అదనపు స్థాయి భద్రతను అందించడానికి ఈ ఉపకరణాలు రూపొందించబడ్డాయి. ఈ హెల్త్ అండ్ హైజీన్ యాక్ససరీస్ టాటా మోటార్స్ జెన్యూన్ యాక్సెసరీస్‌గా అందించబడతాయి మరియు దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్‌షిప్ కేంద్రాలలో ఇవి లభ్యం కానున్నాయి.
టాటా మోటార్స్ హెల్త్ అండ్ హైజీన్ యాక్ససరీస్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.