The series is locked at 1-all after India bounced back strongly, riding on skipper Rohit Sharma's splendid double century to post a big win at Mohali. In a big relief for Sri Lanka, team's star all-rounder Angelo Mathews has recovered from cramps and is available for selection for the series- deciding third ODI against India, here on Sunday.
భారత్ -శ్రీలంకలకు మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వేదికగా విశాఖపట్టణంను ఎంచుకోగా అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమని విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో టాస్ గెలుచుకున్న జట్టు ముందు బ్యాటింగ్‌ను ఎంచుకోవడమే శ్రేయస్కరమంటూ అభిప్రాయపడుతున్నారు.రెండో వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన శ్రీలంక ఏదో ఒక మాయ చేసైనా గెలిచితీరాలనేంత కసిగా ఉంది. మొదటి వన్డేలో ఓడిపోవడంతో అదే స్థాయిలో ప్రత్యర్థి జట్టుకు భారత్ బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే పంథా కొనసాగించాలని భారత్ జట్టు ఆరాటపడుతోంది.
ముందు బ్యాటింగ్ చేసిన జట్టు 270 నుంచి 300 పరుగులు చేయగలదని అంచనా. విశాఖలో రాత్రి మంచు కురుస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు ఇది ప్రతికూలాంశమే. అయితే స్కోరుబోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉన్నప్పుడు మంచు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వారి ఉద్దేశ్యం.