IND VS SL 2020 :India and Sri Lanka are set to lock horns in the three-match T20I series starting from January 5. The hosts have already named a strong squad for the contest and the Islanders have announced a 16-man squad which will travel India to face the Men in Blue. The veteran all-rounder Angelo Mathews has returned to the team after spending 18 months on the sidelines from the format.
#indvssl2020
#indvsslsquad
#AngeloMathews
#lasithmalinga
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#jaspritbumrah
#cricket
#teamindia
ఈ నెల 5 నుండి భారత్-శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించగా.. తాజాగా శ్రీలంక బోర్డు కూడా 16 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. పేసర్ లసిత్ మలింగ టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు మోయనున్నాడు. ఆల్‌రౌండర్ ఏంజిలో మాథ్యూస్ దాదాపు 16 నెలల తర్వాత మళ్లీ టీ20 జట్టులోకి వచ్చాడు.
ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న లసిత్ మలింగాకి భారత పిచ్‌లపై మంచి అవగాహన అంది. దీనికి తోడు మాథ్యూస్ కూడా జట్టులో చేరాడు. కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, ఇసుర ఉదాన లాంటి సీనియర్ క్రికెటర్లు కూడా ఉండడంతో జట్టు పటిష్టంగా మారింది. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది. అదే జోరుని టీమిండియాపైనా కొనసాగించాలని లంక చూస్తోంది.
ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియా తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. అయితే బౌలింగ్ బలహీనత ఆ సిరీస్‌లో కనబడింది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనంతో ఆ లోటు కనబడే అవకాశం లేదు.
తొలి టీ20 మ్యాచ్ జనవరి 5న గౌహతి వేదికగా జరగనుంది. రెండో టీ20 7న ఇండోర్‌లో, చివరి టీ20 మ్యాచ్ 10న పుణెలో జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. లంక జట్టు అతి త్వరలో భారత్ రానుంది. మరోవైపు భారత ఆటగాలు కూడా జట్టుతో కలవనున్నారు.