Rohit Sharma notched up a world record third double century in ODIs. His unbeaten 208 helped India reach 392/4 against Sri Lanka
భారత్-శ్రీలంక జట్ల మధ్య మొహాలి వేదికగా రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కుల్దీప్ స్థానంలో యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ వన్డే అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో భారత్ ఓడటంతో రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో ఘన విజయం సాధించిన లంక అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. కానీ బౌలింగ్ లో విఫలమైన లంక ఆటగాళ్ళు బ్యాటింగ్ గట్టిగా చేస్తే తప్ప గెలవలేని పరిస్థితి.
ఇక మొదటి వన్డే లో చతికిలబడ్డ భారత్ రెండో వన్డే లో ప్రతాపం చూపించింది. వికెట్ పడకుండా క్రీజులో నిలదోక్కుక్కున్న ధావన్ రోహిత్ శర్మ టీం కి గట్టి నమ్మకాన్ని ఇచ్చారు. ఇక' హాఫ్ సెంచరీ అనంతరం శిఖర్ ధావన్ 68 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ శర్మ తో చక్కని భాగస్వామ్యం కొనసాగించిన శ్రేయాస్ అయ్యర్ 88 పరుగుల వద్ద త్రుటిలో సెంచరీ ని మిస్ చేసుకుని ఔటయ్యాడు. ఇక తర్వాత వచ్చిన ధోని దూకుడుగా 6 కొట్టి 7 పరుగులతో వెంటనే అవుట్ అయ్యాడు. ఇక అనంతరం క్రీజులోకి హిట్టింగ్ మ్యాన్ పాండ్య వచ్చాడు. కానీ ఆట ముగుస్తుందనగా పాండ్య కూడా పెవిలియన్ కి చేరాడు.