Virat Kohli hit his 18th Test century, 50th of his international career, as India declared their second innings on 352/8, setting Sri Lanka 231 to win the first Test at Eden Gardens in Kolkata on Day 5.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీకి ఇది 50వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 119 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.
అంతేకాదు ఈ సెంచరీకి ఎంతో ప్రత్యేకతం ఉంది. విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఈడెన్‌లో చేసిన తొలి సెంచరీ ఇది. ఇన్నింగ్స్ 88.4వ బంతిని సిక్స్‌గా మలిచి కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకూ తన టెస్టు కెరీర్‌లో 18 సెంచరీలను నమోదు చేసిన కోహ్లీ ఈడెన్ గార్డెన్స్‌లో ఒక్కటీ నమోదు చేయలేదు.
ఇందులో 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే తొలిసారి ఈడెన్ గార్డెన్స్‌లో సత్తాచాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చివరి రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ లంచ్ విరామం తర్వాత సెంచరీని నమోదు చేశాడు.