మరికొన్ని ఓవర్లు వేసుంటే న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ వికెట్ తీసేవాళ్లమని భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. వెలుతురు లేమితో ఆటను త్వరగా ముగించాల్సి వచ్చిందని, లేదంటే ఇంకో రెండు వికెట్లు పడగొట్టేవాళ్లమన్నాడు. క్రీజులో ఇంకా నిలదొక్కుకోలేదు కాబట్టి కేన్ విలియమ్సన్, టేలర్‌ను సోమవారం త్వరగానే ఔట్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడో రోజు కైల్ జేమీసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని గిల్ ప్రశంసించాడు. గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో 64 బంతుల్లో 28 పరుగులు చేశాడు.