Vijay Shankar In a recent interaction - Sunrisers Hyderabad (SRH) all-rounder opened up about many things, including his comeback plans and also Ambati Rayudu’s 3D Tweet
#VijayShankar
#AmbatiRayudu3DTweet
#VijayShankarOn3DTweet
#3DPlayerVijayShankar
#WorldCup
#IPL2021
#SRH
#AmbatiRayudu
#MSKPrasad
#INDVSENG
#VijayShankarinjuries
టీమిండియా ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ విజయ్ శంకర్ ఫస్ట్ టైమ్ త్రీడీ ట్వీట్‌పై స్పందించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కు అంబటి రాయుడ్ని పక్కన పెట్టిన భారత సెలెక్టర్లు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానం కోసం విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాయుడికి బదులుగా శంకర్‌ను ఎంపికచేయడంపై అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇస్తూ ''రాయుడితో పోలిస్తే విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రూపంలో టీమ్‌కి మూడు కోణాల్లో ఉపయోగపడతాడు. అతను త్రీడీ ప్లేయర్'' అని చెప్పుకొచ్చాడు. దాంతో.. అంబటి రాయుడు 'వరల్డ్‌కప్‌ని చూసేందుకు ఇప్పుడే కొత్త త్రీడీ గ్లాస్‌లను ఆర్డర్ చేశాను'అని సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగగా.. ఇప్పటికీ విజయ్ శంకర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ 'త్రీడీ' అంశం తెరపైకి వస్తోంది.