కేంద్ర నూతనంగా తీసుకొని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పండించిన పంట గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు చేస్తున్న ఆందోళన 100 వ రోజుకు చేరుకుంది. వంద రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై మొండిగా వ్యవహరిస్తోంది. అటు రైతులు సైతం వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు.ఇక నేటితో రైతుల ఆందోళనకు 100 రోజులు కావటంతో నేడు బ్లాక్ డే పాటిస్తున్నారు.
#AgricultureLaws
#FarmsBills
#Farmers
#PMModi
#RahulGandhi
#AgricultureBills
#SamyuktKisanMorcha