Chief Minister of Arunachal Pradesh Pema Khandu tweets after the video conference meeting of Chief Ministers with Prime Minister Narendra Modi.
#indialockdown
#PMModiVideoConference
#LockdownEndOnApril14
#pmmodiChiefMinisters
#stayhomestaysafe
#PemaKhandu
లాక్‌డౌన్. దేశం మొత్తాన్నీ స్తంభింపజేసిన ఉదంతం. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిరోధించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ ప్రజలను ఇళ్లకు పరిమితం చేసింది. రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. ఢిల్లీ మత ప్రార్థనల అనంతరం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో.. దీన్ని మరి కొంతకాలం పాటు పొడిగించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెలువడ్డాయి.అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఏప్రిల్ 14వ తేదీ తరువాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ సందిగ్ధావస్థకు తెర దించారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు. ఈ నెల 14వ తేదీన లాక్‌డౌన్ ముగుస్తుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.