IND vs NZ 5th T20I: Rohit Sharma Register Most 50 Plus Scores In T20Is

Oneindia Telugu 2020-02-03

Views 157

IND vs NZ 5th T20I: Rohit Sharma on Sunday went past Virat Kohli to become the only batsman with 25 scores in excess of 50 in T20I cricket
#NZvIND
#INDvsNZt20
#KLRahul
#RohitSharma
#IndiavsNewZealand
#ViratKohli
#rosstaylor
#KaneWilliamson
#IndVsNz
#RohitSharmarecords
#SanjuSamson
ఐదో టీ20లో 'హిట్‌మ్యాన్‌' రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయడంతో ఓ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50+ స్కోరు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 25 సార్లు రోహిత్ 50+ స్కోర్లు చేసాడు. దీంతో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఇప్పటివరకు రోహిత్ 108 టీ20 మ్యాచ్‌లు ఆడి.. నాలుగు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలతో 50+ స్కోర్లు సాధించిన వారిలో అందరికంటే ముందున్నాడు.
విరాట్ కోహ్లీ 24 అర్ధ శతకాలు సాధించాడు. అయితే కోహ్లీ ఇప్పటివరకు 82 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐదవ టీ20 మ్యాచ్‌కు విరాట్ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గప్టిల్‌, ఐర్లాండ్‌కు చెందిన పాల్‌ స్టిర్లింగ్‌ 17 సార్లు 50+ స్కోర్లు చేశారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 16 సార్లు ఈ ఘనత అందుకున్నాడు.

Share This Video


Download

  
Report form