Quinton de Kock smashed quick 79 to guide South Africa to a 9-wicket win over India and level the series 1-1. Reeza Hendricks managed 26-ball 28 while Temba Bavuma hit a 23-ball 27 as young South African side beat an experienced Indian side in their own backyard.
#IndiavsSouthAfrica3rdT20I
#southafricatourofindia2019
#indvssa2019
#indvsa3rdT20
#QuintondeKock
#BeuranHendricks
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket
దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు పేలవంగా ఓడిపోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (36: 25 బంతుల్లో 4x4, 2x6) మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరచడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా.. ఛేదనలో డికాక్ (79 నాటౌట్: 52 బంతుల్లో 6x4, 5x6) అజేయ హాఫ్ సెంచరీ బాదడంతో దక్షిణాఫ్రికా మరో 19 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మూడు టీ20ల ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా. రెండో టీ20లో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే.మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు టీ20లు ముగియగా.. గత ఆదివారం ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. ఇక గత బుధవారం మొహాలి వేదికగా ముగిసిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. ఈరోజు మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్‌ని 2-0 చేజిక్కించుకోవాలని కోహ్లీసేన ఆశిస్తోంది. మరోవైపు కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది.