Mohammad Amir Retirement:Speedster Mohammed Amir called time on his Test career, the Pak Cricket Board (PCB) announced on Friday.
#MohammadAmirretirement
#WasimAkram
#MohammadAmir
#pakpacer
#PCB
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమీర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది. పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తెలిపాడు. టెస్టు ఫార్మాట్‌లో పాక్ జట్టుకు ఆమిర్ అవసరం చాలా ఉందన్నాడు. ‘మహ్మద్ ఆమిర్ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే 28 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో గొప్ప ఫార్మాట్ అయిన టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పడం. పైగా పాకిస్తాన్ జట్టుకు అతని అవసరం ఎంతో ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలోని రెండు టెస్ట్‌లు, ఇంగ్లండ్‌లో మూడు టెస్ట్‌లకు జట్టులో అతను ఉండటం ముఖ్యం’ అని వసీం ట్వీట్ చేశాడు. ఇక షోయబ్ అక్తర్ సైతం ఆమిర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు.