India vs Australia 2019: MS Dhoni Gets A New Hair Style Ahead Of Australia series | oneindia telugu

Oneindia Telugu 2019-02-20

Views 204

Mahendra Singh Dhoni has revealed a new look that he will be sporting for the upcoming three-match T20I series against Australia starting 24 February
#MSDhoni
#indiavsaustralia2019
#indvsausT20Iseries
#viratkohli
#rohithsharma
#rishabpanth
#dhoninewhairstyle
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మళ్లీ సరికొత్త హెయిల్ స్టైల్‌తో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 24 నుంచి రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని తన హెయిర్ స్టైల్‌ని మార్చుకున్నట్లు అతని స్నేహితురాలు, స్టైలిస్ట్ సప్న భవాని ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
కెరీర్ ఆరంభంలో జులపాల జుట్టుతో పాకిస్థాన్ అధ్యక్షుడ్ని సైతం ధోని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి హెయిర్ స్టైయిల్స్‌ ధోని తరచూ మారుస్తున్నాడు. గతేడాది పేలవ ఫామ్‌తో విమర్శలు పాలైన ధోని... తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ముగిసిన వన్డే సిరిస్‌లతో ఫామ్‌ను అందుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్‌లో వరుసగా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాది ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డుని సైతం అందుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ ఫినిషర్‌గా, వికెట్ కీపర్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాగా, రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ కోసం సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
విమానాశ్రయం నుంచి రెండు బస్సుల్లో హోటల్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మంగళవారం విశ్రాంతి తీసుకోనున్నారు. ఫిబ్రవరి 24న విశాఖపట్నం వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరిస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో రెండ్రోజుల ప్రాక్టీస్‌ అనంతరం 22న విశాఖపట్నం బయల్దేరుతారు.
మార్చి 2న హైదరాబాద్‌లో తొలి వన్డే జరగనుంది. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఆడనున్న చివరి సిరిస్ కావడంతో ఈ సిరిస్‌లో టీమిండియా ప్రయోగాల బాట పట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో సిరిస్‌కు సెలక్టర్లు జట్టుని ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS