India's former skipper MS Dhoni was dismissed for a golden duck after a period of nine years. Dhoni was looking to guide Adam Zampa to the off side while facing his first ball of the innings against Australia in the ongoing fixture at Nagpur.
#IndiaVsAustralia2019
#indvsaus2ndODI
#MSDhoni
#ViratKohli
#vijayshankar
#mohammedshami
#ambatirayudu
#kedarjadav
#rohithsharma
#cricket
#teamindia
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గోల్డెన్ డక్ రూపంలో పెవిలియన్ చేరాడు. కేదార్ జాదవ్(11) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని.. తాను ఆడిన తొలి బంతికే ఔట్ అయ్యాడు.
ఆడమ్ జంపా వేసిన 33 ఓవర్ మూడో బంతిని కవర్స్ మీదుగా షాట్ ఆడాడు. అయితే, ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఖవాజా క్యాచ్ పట్టడంతో ధోని ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. తన వన్డే కెరీర్‌లో ధోని ఇలా గోల్డెన్ డక్‌గా ఔట్ కావడం ఐదోసారి. అంతేకాదు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టుపై ధోని గోల్డెన్ డకౌటయ్యాడు.