Former India captain Sourav Ganguly on Sunday (November 12) advised the World Cup winning skipper Mahendra Singh Dhoni to approach the Twenty20 Internationals "differently".
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన రిటైర్మెంట్ పైన వస్తున్న సూచనలు, సలహాలపై స్పందించాడు. ధోనీ మిస్టర్ కూల్‌గా పేరుగాంచారు. ఈ విషయంలో తనపై కొందరు చేస్తున్న కామెంట్ల పైన కూడా అలాగే స్పందించాడు.
తన రిటైర్మెంట్ గురించి ధోనీ మాట్లాడుతూ, ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని చెప్పాడు. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఇక తన వరకు వస్తే దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయం అన్నాడు.ఒక జీవిత కాలం డెబ్బై ఏళ్లు అనుకుంటే అందులో కేవలం పది నుంచి పదిహేనేళ్ల పాటు మాత్రమే జట్టుకు ప్రాతినిథ్యం వహించగలమని ధోనీ చెప్పాడు. అంత కాలం ఆడితే సుదీర్ఘ కాలం ఆడినట్టే అన్నాడు. అదే స్పూర్తినిచ్చే విషయమన్నాడు.తాను ఫలితం కంటే ప్రయత్నం పైనే ఎక్కువ దృష్టిసారిస్తానని ధోనీ చెప్పాడు. మ్యాచ్ పూర్తయిన అనంతరం అద్దం ముందు నిలబడి మనతో మనం నూటికి నూరు శాతం నిజాయతీగా, పూర్తి సామర్థ్యంతో ఆడానని చెప్పగలిగితే ఫలితం దానంతట అదే వస్తుందన్నాడు.