India vs Australia 2nd ODI Highlights : MS Dhoni Virat Kohli,Star As India Win Against Australia

Oneindia Telugu 2019-01-15

Views 300

India vs Australia 2nd ODI: India registered a six-wicket win against Australia in the second ODI to level the 3-match series 1-1.
#IndiaVsAustralia2ndODIhighlights
#MSDhoni
#Virat Kohli
#RohitSharma
#BhuvneshwarKumar

ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌లో భారత్‌ లెక్కసరిచేసింది. అడిలైడ్ వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ , మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 299/4తో ఛేదించింది. టీమిండియా విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ తో కలిసి సింగిల్స్‌ తీస్తూ సమయోచితంగా ఆడిన మహేంద్రసింగ్ ధోనీ.. ఆఖరి ఓవర్‌లో కళ్లుచెదిరే సిక్స్ బాది భారత్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. దీంతో సిరీస్ 1-1తో సమమవగా విజేత నిర్ణయాత్మక మూడో వన్డే శుక్రవారం ఉదయం 7.50 గంటల నుంచి జరగనుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ , శిఖర్ ధావన్ జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చి ఔటవగా.. అంబటి రాయుడు కాసేపు మాత్రమే క్రీజులో నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS