Rishabh Pant Meets Tim Paine's Wife Bonnie Paine And Kids

Oneindia Telugu 2019-01-01

Views 3

Having been asked to babysit by Tim Paine, Rishabh Pant finally go to meet the Australian skipper's wife and kids. The picture from the meeting, uploaded by Bonnie Paine, has gone viral on social media.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఈ స్లెడ్జింగ్ తక్కువగానే కనిపించినప్పటికీ, మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం మరింత తీవ్రరూపం దాల్చింది.
బాక్సింగ్ డే టెస్టులో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన నిలకడగా ఆడుతోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పంత్ సైతం పైన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు.
వీరిద్దరి మధ్య నడిచిన మాటల యుద్ధంపై అటు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో తెగ్ ట్రోల్ చేశారు. దీంతో ఆటగాళ్ల మధ్య చోటు చేసుకున్న ఈ స్లెడ్జింగ్‌ మరే వివాదానికి దారితీస్తుందో అని క్రికెట్‌ అభిమానులు కవలవరపడ్డారు. అయితే, ఇదంతా ఆటలో భాగమేనని, మైదానం దాటితే తామంతా మంచి స్నేహితులమని పంత్‌ నిరూపించాడు.
#RishabhPant
#timpinekids
#IndiavsAustralia
#Sledging
#viratkohli
#TimPaine

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS