As Australia were put under pressure early, Pant tried to get under the skins of the opponents’ batsmen with some good old fashioned sledging.
#IndiavsAustralia
#indvsaus
#RohitSharma
#CheteshwarPujara
#sledging
#RishabhPant
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారమైన రెండో రోజు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్లెడ్జింగ్‌కి దిగాడు. ఓవర్‌నైట్ స్కోరు 250/9 పరుగులతో రెండోరోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా పరుగులేమీ చేయకుండానే షమీ(6) రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా (28: 125 బంతుల్లో) బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక నుంచి కవ్వింపు తరహాలో రిషబ్ పంత్ మాట్లాడిన మాటలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.