Poonam Kaur takes sensational decision. Once again made indirect comments on director
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ మరో మారు సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా కాలంగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పరోక్షంగా ఓ దర్శకుడిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దర్శకుడి వలనే తన కెరీర్ నాశనం అయిందనే అర్థం వచ్చే విధంగా పూనమ్ కామెంట్స్ చేస్తోంది. ఇటీవల రేణు దేశాయ్ తీసుకున్న సంచలన నిర్ణయాన్నే పూనమ్ కౌర్ కూడా తీసుకుంది. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ చాలా ఘాటుగా ఉన్నాయి.
ఇటీవల రేణు దేశాయ్ తన ట్విటర్ అకౌంట్ ని క్లోజ్ చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నెటిజన్ల ట్రోలింగ్ నుంచి దూరంగా ఉండేందుకు రేణు దేశాయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తాజాగా పూనమ్ కౌర్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల పూనమ్ కౌర్ చేస్తున్న ట్వీట్స్ పై కూడా నెటిజన్ల ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో గందరగోల పరిస్థితులు నెలకొంటున్నాయని అందువలన తాను ట్వీటర్ వదలి వెళుతున్నట్లు పూనమ్ కౌర్ ప్రకటించారు. తాను తిరిగి సోషల్ మీడియాలోకి ఎప్పుడు వస్తానో చెప్పలేనని పూనమ్ తెలిపింది.
పూనమ్ కౌర్ ఇప్పటి వరకు పరోక్షంగా తీవ్ర చర్చకు దారితీసేలా చాలా ట్వీట్స్ చేసింది. ఆ మీ ట్వీట్స్ ని బట్టి చూస్తే ఓ దర్శకుడ్ని ఆమె టార్గెట్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. దీనితో పూనమ్ పై నెటిజన్లు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు.