ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి పూనమ్ కౌర్ లాల్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్‌గా తన గళాన్ని వినిపిస్తున్నారు. అప్పుడప్పుడు రాజకీయాల్లో, సమస్యలపై స్పందించే పూనమ్ కౌర్ తాజాగా పాలిటిక్స్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యక్తిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి.
మన సమస్యలు పరిష్కరించడానికి దేవుడు అవసరం లేదు. ఎందుకంటే మన సమస్యలను మనుషులే సృష్టిస్తున్నారు. వాటిని పరిష్కరించడానికి మానవత్వం ఉన్న మనిషి చాలు అని పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. సదరు వ్యక్తి పేరు ట్వీట్‌లో ఎక్కడా ప్రస్తావించనప్పటికీ ఈ వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేశారనే వాదన వ్యక్తమవుతున్నది.
ఒకవేళ ఎవరికైనా మాస్‌ను ఆకర్షించే రూపం. భాషను అనర్గళంగా మాట్లాడే సత్తా ఉంటే అవి మా వాదన తొక్కేయ్యడానికే. అయినా మేము మనుషులుగానే ఉండటానికి ప్రయత్నిస్తాం అని పూన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మానవత్వం లేకుండా ఓ వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడో నాకు అర్థం కావడం లేదు. టెర్రరిస్టుకైనా తాను చేసే పనిపైనా పూర్తిగా అవగాహన ఉంటుంది. నాకు కూడా ఏం చేయాలో అనే విషయం తెలుసు. ఓ మనిషిని ఎలాగైనా మార్చే శక్తి రాజకీయాలకు ఉన్నాయి అని పూనమ్ ఘాటుగా స్పందించారు.