Poonam Kaur Sensational Comments On Tollywood Issue

Filmibeat Telugu 2018-06-28

Views 13

సంచలనం రేపుతున్న చికాగో సెక్స్ రాకెట్ గురించి టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సెక్స్ రాకెట్ వ్యవహారం టాలీవుడ్ ని కుదుపునకు గురి చేస్తోంది.=
తాజగా పూనమ్ కౌర్ కూడా సెక్స్ రాకెట్ గురించి స్పందించింది. అసలు కిషన్, చంద్ర దంపతులు భార్యాభర్తలు కాదని బాంబు పేల్చింది. ఈ వ్యవహారంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలని కూడా పూనమ్ వెల్లడించింది.
కిషన్, చంద్ర దంపతులకు సంబందించిన ఓ వ్యక్తి అర్థ రాత్రి వచ్చి తన గది తలుపులు తట్టాడని పేర్కొంది. అతడు మాట్లాడేది నాకు అర్థ కాదు అనుకున్నాడేమో.. కానీ తనకు తెలుగు అర్థం అవుతుందని పూనమ్ పేర్కొంది. ఆ సమయంలో అతడి చెంప పగల గొట్టానని తెలిపింది.
ఆ సమయంలో తాను ఓ సంస్థ కోసం అమెరికా వెళ్లానని పూనమ్ కౌర్ తెలిపింది. తాను ఒంటరిగానే ఉన్నానని పూనమ్ కౌర్ తెలిపింది. అమాయకమైన అమ్మాయిలే వారి టార్గెట్ అని పూనమ్ పేర్కొంది. ధనం ద్వారా లేదా భయ పెట్టి అయినా లొంగదీసుకుంటారని తెలిపింది.

Share This Video


Download

  
Report form